![]() |
![]() |

అగ్నిపరీక్ష సీజన్ 2 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇక ఇందులో నుండి ఎవరు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్తారా అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.. స్టాప్ స్టిక్స్ తో విన్నర్ అని బ్లాక్స్ పెట్టే టాస్క్ లో ఝాన్సీ తన దగ్గరున్న హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ ని వాడేయడంతో రామకృష్ణ, ఝాన్సీ, దీపక్ ఉన్న గ్రీన్ టీం ఈ టాస్క్ లో విన్ అయింది. అయితే విన్నర్ అయ్యాక ఓట్ అప్పీల్ విషయంలో ఆ టీంలోనే గందరగోళం నడిచింది. ముందుగా దీపక్ కి ఓట్ అప్పీల్ ఇస్తామని ఆ టీమ్ చెప్పడంతో జ్యూరీలు ఫైర్ అయ్యారు.గెలిచింది ఝాన్సీ తన ఫైర్ కార్డ్ వాడడం వల్ల, ఆమెకే ఓట్ అప్పీల్ ఇవ్వాలి.. లేదంటే నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావ్ కాబట్టి నువ్వైనా తీసుకోవాలి కదా అని రామకృష్ణను నవదీప్, బిందు, శ్రీముఖి గట్టిగా తిట్టారు. దీంతో మాట మార్చుకుని చివరకు రామకృష్ణ తనే ఓట్ అప్పీల్ కి వెళ్లాడు. అతను డేంజర్ జోన్ నుంచి బయటపడేందుకు ఈ ఓట్ అప్పీల్ ఉపయోగపడింది.
అదే టాస్క్ లో అద్భుతంగా ఆడిన రోహిత్ కి జ్యూరీలు మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్ ( Most Valuable Player) అవార్డు ఇచ్చారు. ఎల్లో టీమ్ నుంచి రోహిత్ చాలా కష్టపడ్డాడని.. టాస్క్ ని బాగా ఆడాడని చెప్పి అతనికి కూడా ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చారు. దీంతో ఈ రోజు రెండు ఓట్ అప్పీల్స్..ఒకటి విన్నర్ టీం అయిన రామకృష్ణకి, రెండోది మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్ అయిన రోహిత్ కి దక్కాయి.
ఇక పెనాల్టీ విషయానికి వస్తే.. రోజంతా ఏ టాస్క్ లోనూ యాక్టివ్ గా లేక, నంబర్ టాస్క్ లో నంబర్ ని వదిలేసి వాదించలేక ఫెయిల్ అయిన ప్రియాంకను జ్యూరీలు డేంజర్ జోన్ లోకి వేశారు. ఆమె ఏం ఆడలేదని చెప్పి ఎల్లో కార్డ్ కూడా ఇచ్చారు. ఇకపై ఎల్లో కార్డులు లేవు.. డైరెక్ట్ గా రెడ్ కార్డులే ఉంటాయని అభిజిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చివర్లో తనకు తగిలిన గాయం వల్లే ఎవరూ తనను టీంలోకి తీసుకోవడం లేదని భాగి ఎమోషనల్ అవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది.
![]() |
![]() |